Skip to content

Latest commit

 

History

History
115 lines (58 loc) · 16.7 KB

telugu.md

File metadata and controls

115 lines (58 loc) · 16.7 KB

BBC తెలుగు

నీరు లీక్ అవుతుందని నైట్ షిఫ్ట్ కార్మికులు చెప్పినా మార్నింగ్ షిఫ్ట్‌లో వర్కర్స్‌ను పంపించారా? ‘ఎస్ఎల్‌బీసీ’ ప్రమాదంలో సమాధానం లేని ప్రశ్నలెన్నో

6, మార్చి 2025, గురువారం 6:41:15 AMకి

సొరంగం నిర్మాణంలో భాగంగా ఎక్కడైతే లీకేజీ ఎక్కువ ఉందో అక్కడ పకడ్బందీగా నీరు లీకేజీ ఆపేలా చేసిన ఏర్పాటు నిలవలేదు. అక్కడ పెట్టిన కాంక్రీట్ గ్రౌటింగ్, పేర్చిన కాంక్రీట్ రిమ్ములు ఊడి కిందపడిపోయాయి. సమస్య ఫలానా చోట ఉందని తెలిసీ దాన్ని సమగ్రంగా అరికట్టడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

దేశం మధ్యలో దేశం.. ట్రంప్ ‘ఎన్నడూ వినని కంట్రీ’ గురించి 9 ఆసక్తికర విషయాలు

6, మార్చి 2025, గురువారం 5:29:02 AMకి

అమెరికన్లు వేసుకునే జీన్స్ ప్యాంటుల్లో ఎక్కువ భాగం లెసొతోలోనే ఉత్పత్తి అవుతాయి. అమెరికాలో ప్రముఖ బ్రాండ్లైన లెవిస్, రాంగ్లర్‌కు అవసరమైన జీన్స్ ప్యాంట్లను లెసొతోలోని ఫ్యాక్టరీల్లోనే కుడతారు. దీంతో ఈ దేశానికి “డెనిమ్ కేపిటల్ ఆఫ్ ఆఫ్రికా” అని పేరు వచ్చింది.

మిత్ర్ క్లినిక్: డోనల్డ్ ట్రంప్ నిర్ణయానికి హైదరాబాద్‌లోని ఈ ఆసుపత్రి మూతపడటానికి సంబంధం ఏంటి?

5, మార్చి 2025, బుధవారం 2:12:55 PMకి

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తీసుకున్న ఓ నిర్ణయం హైదరాబాద్‌లోని ఓ క్లినిక్ మూతపడటానికి ఎలా కారణమైంది? ఇక్కడ చికిత్స పొందుతూ, కౌన్సెలింగ్ తీసుకునేవారి పరిస్థితి ఇకపై ఎలా ఉండనుంది?

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు ఈజీయేనా?

6, మార్చి 2025, గురువారం 2:50:42 AMకి

భారత జట్టులో నలుగురు స్పిన్నర్లున్నారు. ఇది న్యూజీలాండ్‌కు అతి పెద్ద సవాల్ అని విశ్లేషకులు చెప్తున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ టోర్నీలోని నాలుగు మ్యాచ్‌లలో చెరో అయిదు వికెట్లు తీసుకున్నారు. మరోవైపు వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచుల్లోనే ఏడు వికెట్లు తీసుకుని ఫామ్‌లో ఉన్నాడు.

ట్రంప్ టారిఫ్‌లు ఏమిటి? ఏయే దేశాలపై ప్రభావం ఉంటుంది

6, మార్చి 2025, గురువారం 1:20:53 AMకి

అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ఫిబ్రవరి ప్రారంభంలోనే టారిఫ్‌లు విధించాల్సి ఉంది. కానీ, ఒక నెల ఆలస్యమైంది. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

'వైఎస్‌ జగన్‌ను క్షమిస్తున్నా' అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఎందుకన్నారు?

5, మార్చి 2025, బుధవారం 10:56:53 AMకి

‘‘ఆంధ్రప్రదేశ్‌లో 1972-77 మధ్య కాలంలో 5వ శాసనసభలోనూ, 1994-99 మధ్యకాలంలో 10వ శాసన సభలోనూ ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకీ ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు.’’

బెల్టులో బంగారం:  సినీనటి రన్యారావు అరెస్ట్, అసలేం జరిగింది? విదేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు

5, మార్చి 2025, బుధవారం 12:11:41 PMకి

రన్యారావు తాను ధరించిన ప్రత్యేక బెల్టులో గోల్డ్ బార్లను దాచారని ఆర్ఐడీ చెప్పింది. దీంతో పాటు, ఆమె వద్ద నుంచి 800 గ్రాముల బంగారు ఆభరణాలనూ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

డోనల్డ్ ట్రంప్: ‘ఇది అమెరికా స్వర్ణ యుగానికి ఆరంభం మాత్రమే’

5, మార్చి 2025, బుధవారం 4:25:55 PMకి

ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో ఎలా మాట్లాడేవారో, ఎలా కనిపించేవారో ఇప్పడూ అలానే ఉన్నారు. అయితే ఈసారి మరింత అనుభవంతో, రెట్టించిన ధైర్యంతో కనిపిస్తున్నారు.

సావిత్రమ్మ: సింహాలు, పులులు సహా అనేక జంతువుల పిల్లలకు ఈమె అమ్మ

5, మార్చి 2025, బుధవారం 4:20:13 AMకి

‘‘ఇక్కడ వీటినిపెంచి, పెద్దవి అయ్యక సఫారీలో వదిలేస్తాం. ఇక్కడ చిన్ను, బంగారి అంటాము. అక్కడకి పోయి నా గొంతు వినిపిస్తే చాలు, పరిగెత్తుకుని వస్తాయి.''

భూమిలోని కోర్ వ్యతిరేక దిశలో తిరుగుతోందా, ఏం జరగబోతోంది?

21, జులై 2024, ఆదివారం 2:58:08 PMకి

భూ ఉపరితలంతో పోల్చినప్పుడు, భూమి కోర్ నెమ్మదిగా, వ్యతిరేక దిశలో తిరుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ శాస్త్రవేత్తల బృందం కనుగొంది.

ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని ఎందుకు అంటాం, ఆ పదం ఎలా పుట్టింది?

21, నవంబర్ 2024, గురువారం 2:33:42 PMకి

కొత్తవారిని కూడా ‘హలో’ అని పలకరించి మాటలు కలుపుతుంటాం. పరిచయాలకు, సంభాషణలకు తొలి మెట్టు అయిన హలో అనే పదం ఎలా పుట్టింది? మన వాడుకలోకి ఎలా వచ్చింది?

త్రివేణి సంగమం: తెలుగురాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,ఏయే నదులు కలుస్తాయి?

26, జనవరి 2025, ఆదివారం 5:43:31 AMకి

సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.

డిజిటల్ లెగసీ విల్: మనం చనిపోయాక ఫేస్‌బుక్, ట్విటర్‌ అకౌంట్లను ఏం చేస్తారు?

16, మార్చి 2024, శనివారం 1:16:40 AMకి

ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లను వాడుతున్నారు. అయితే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారికి చెందిన ఆన్‌లైన్ ఉనికి ఏమవుతుందనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఒక ఇంజినీర్ ట్రైన్ మిస్ కావడం వల్ల ఇంత పెద్ద ఆవిష్కరణ సాధ్యమైందని తెలుసా?

1, డిసెంబర్ 2024, ఆదివారం 6:22:06 AMకి

1879లో సర్ శాన్‌ఫోర్డ్ ఫ్లెమింగ్ రైలును మిస్ అయ్యారు. కెనడాలో రైలు ఇంజనీర్ అయిన ఫ్లెమింగ్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదే టైమ్ జోన్‌. 1883 నవంబర్ 18న అమెరికా, కెనడాల్లోని రైలు పరిశ్రమలు ఫ్లెమింగ్ ప్రతిపాదనను ఆమోదించాయి.